News March 7, 2025

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఈనెల 8వ తేదీ(శనివారం) చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును DEO వరలక్ష్మి ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఉపాధ్యాయునిలు జరుపుకోవాలని ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 13, 2026

కల్తీపాల వ్యవహారంలో కుప్పం వాసులు.!

image

కుప్పం, పలమనేరు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కల్తీ పాల తయారీ గుట్టురట్టైంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించిన పోలీసులు, మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలకు చెందిన నలుగురు ఈ వ్యవహారంలో ఉన్నట్లు గుర్తించారు. వీరు పాలను కర్ణాటకలో విక్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News February 13, 2026

హైవేలపై ప్రాణాలు పోతున్నాయ్: MLA

image

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో ఏడాదికి 400 మంది వరకు చనిపోతున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగమర్ల నుంచి నేండ్రగుంట వరకు ఉన్న హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా తిరుపతి రుయా లేదా వేలూరు ఆసుపత్రికి తరలించాలి. ఈలోపు ప్రాణాలు పోతున్నాయి. పి.కొత్తకోట వద్ద 50 బెడ్లతో ట్రామాకేర్ ఏర్పాటు చేయాలి’ అని MLA కోరారు.

News February 13, 2026

ఆ పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలి: చిత్తూరు MP

image

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ఏపీలో అమలు చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. ప్రస్తుతం చంఢీగఢ్, అస్సాం, పంజాబ్, ఉత్తరఖండ్, హర్యానా, పుదుచ్చేరిలో అమలులో ఉన్న ఈ పథకాన్ని ఏపీలోనూ అమలు చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు.