News October 16, 2024

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. అత్యధికంగా నింద్రలో 22.8 మిమీ, అత్యల్పంగా తపణంపల్లెలో 1.0 మిమీ వర్షం కురిసింది, మండలాల వారీగా రొంపిచెర్లలో 12, సదుంలో 9.6, పులిచెర్లలో 16.2, వెదురుకుప్పంలో 44, విజయపురంలో 5.4, నగరిలో 8.6, కార్వేటినగరంలో 5.4, పెనుమూరులో 3.6, పూతలపట్టులో 8.8, సోమలలో 12.6, చౌడేపల్లిలో 5.4, పుంగనూరులో 6.2మీ.మీ వర్షపాతం నమోదు అయింది.

Similar News

News February 14, 2026

చిత్తూరు: 18 సమస్యలకు పరిష్కారం

image

జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి, సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లలో 72 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లలో 22,LT లైన్లలో 163, సర్వీసులైన్‌లో 15 కలిపి మొత్తం 272 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 18 సమస్యలను పరిష్కారించామన్నారు.

News February 14, 2026

చిత్తూరు: విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. PD సస్పెండ్

image

పెనుమూరు ZP ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 మే నెలలో పాఠశాలలోని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై HRDలో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిని విచారించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి చిత్తూరు డీఈవోకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో చిత్తూరు డీవైఈవో ఇందిర నివేదిక మేరకు ఆయన్ను సస్పెండ్ చేశారు.

News February 14, 2026

కుప్పం DSP పై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

image

కుప్పం DSP పై MLC భరత్ శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గంలో అత్యవసర ప్రజా ఫిర్యాదులు, శాంతిభద్రతల సమస్యలను చర్చించేందుకు DSPకి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని, ప్రోటోకాల్‌కు సంబంధించి ప్రభుత్వ స్టాండింగ్ ఆర్డర్‌లను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు ప్రివిలేజ్ కమిటీని పంపాలని, కుప్పం DSP పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.