News October 12, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జీడి నెల్లూరులో 7.2, చిత్తూరు రూరల్ లో 5.4, కుప్పం 8.4, బంగారుపాలెం 1.6 యాదమరి 1, చిత్తూరు అర్బన్ 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు చెప్పారు. మొత్తం 7 మండలాలలో వర్షపాతం నమోదుకాగా 25 మండలాలలో వర్షం పడలేదన్నారు.

Similar News

News October 12, 2025

పెద్దపంజాణిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

image

పెద్దపంజాణి మండలం వీర పల్లె కొండపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతుండగా అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీతో పాటు కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. మరో నలుగురు పరారీ కాగా వారికోసం గాలిస్తున్నారు.

News October 12, 2025

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117నుంచి రూ.138, మాంసం రూ.170 నుంచి 205 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 12, 2025

హైకోర్ట్ న్యాయమూర్తిని కలిసిన SP

image

చిత్తూరు SP తుషార్ డూడీ శనివారం జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ బి.కృష్ణ మోహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోర్టు కార్యాలయంలో న్యాయమూర్తికి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా న్యాయవిధాన పరిపాలనపై వారు చర్చించారు.