News December 3, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలియజేశారు. విజయపురంలో అత్యధికంగా 24.2 మీ.మీ వర్షపాతం నమోదయింది. కార్వేటి నగరంలో 18, వెదురుకుప్పంలో 12.6, సోమలలో 12.4, రొంపిచర్ల 9.2, ఎస్.ఆర్ పురంలో 7.2, పాలసముద్రం 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.

Similar News

News February 10, 2026

చిత్తూరు జిల్లాలో కష్టంగా పశుపోషణ…!

image

చిత్తూరు జిల్లాలో చలికాలం కావడంతో పశుపోషణ రైతులకు తీవ్ర భారంగా మారింది. చలి కారణంగా పచ్చి గడ్డి త్వరగా పెరగడం లేదు. పశువుల మేతకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఎండు గడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గడ్డి మోపు ధర ఒక్కటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో రైతులు పశువులను పోషించడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల రేట్లు తక్కువగా ఉండటంతో పశుపోషణ కష్టంగా మారింది.

News February 10, 2026

మార్చి 15 లోపు పనులు పూర్తి: చిత్తూరు కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందిన నిధులను మార్చి 15లోగా వినియోగిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్టీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047విజన్ లక్ష్యంలో భాగంగా 10సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈసమావేశంలో కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంతో ఎస్పీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

News February 10, 2026

చిత్తూరు: పథకాలు సాధించడం అభినందనీయం

image

నెల్లూరు జిల్లాలో గత నెల నిర్వహించిన పారా స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ విభాగంలో జిల్లా దివ్యాంగ క్రీడాకారులు పతకాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. జిల్లా తరఫున మొత్తం 16 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 23 పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు.