News December 24, 2024

చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నేడు ఆప్షనల్ సెలవు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఇవాళ ఆప్షనల్ సెలవును ప్రకటిస్తున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. తప్పనిసరిగా అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాలని ఆమె ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఈ నిబంధన వర్తించదు.

Similar News

News December 24, 2024

PV.సింధు దంపతులను కలిసిన మాజీ మంత్రి రోజా

image

హైదరాబాదులోని అన్వయ కన్వెన్షన్ హాల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV.సింధూ, వెంకట దత్త సాయి దంపతులను మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.

News December 24, 2024

టీటీడీలో ఫుడ్ సేఫ్టి విభాగం ఏర్పాటు

image

టీటీడీలో త్వరలో ఫుడ్ సేఫ్టి విభాగం ఏర్పాటు చేసి సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టు నియమించుకునేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం రూ.3.36 కోట్ల‌తో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం. ఒంటిమిట్ట ఆలయ విమాన గోపురానికి రూ.43 ల‌క్ష‌ల‌తో బంగారు కలశం ఏర్పాటు. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి 3.60 ఎకరాల స్థలానికి నిర్ణ‌యించిన రూ.20కోట్ల‌కు పైగా ఉన్న‌ లీజు ధరను తగ్గించాలి.

News December 24, 2024

టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు

image

* టీటీడీ ఆల‌యాలు, ఆస్తుల GLOBAL EXPANSION కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు. * దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం. * స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు. * టీటీడీ వైద్యులు, సిబ్బంది నియామకం, పరికరాలు కొనుగోలు. * భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు.