News December 30, 2025
చిత్తూరు జిల్లాలో 31న రాత్రి తనిఖీలు

నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తప్పతాగి రోడ్లపైకి రావడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ న్యూసెన్స్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. 31వ తేదీ రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుందన్నారు.
Similar News
News December 30, 2025
చిత్తూరు: క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన యువకుడు

గుంటూరులో జరుగుతున్న ఎలైట్ అండర్-19 క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లా వి.కోట విద్యార్థి కార్తీక్ అదరగొట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న అతను సెమి ఫైనల్లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ క్రికెట్ అకాడమీ జట్టుపై చెలరేగి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన కార్తీక్ 7 ఫోన్లు 3 సిక్సర్లతో 82 బంతుల్లోనే 96 రన్స్ చేశాడు. తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. బుధవారం తుది పోరు జరగనుంది.
News December 30, 2025
చిత్తూరు: కొత్త అధికారుల నియామకం

చిత్తూరు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ రిటైరయ్యారు. నెల్లూరు జిల్లా ఆత్మ పీడీ మురళికి చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యాన శాఖ DDగా ఉన్న మధుసూదన్ రెడ్డి సైతం రిటైర్డ్ కాగా ఆయన స్థానంలో ఆత్మ PDగా పనిచేస్తున్న రామాంజనేయులకు DDగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
News December 30, 2025
చిత్తూరులో భారీ స్కాం.. ఆ లైసెన్సులు రద్దు!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన చిత్తూరు జిల్లా GST స్కాంలో జిల్లాకు చెందిన ఏడు పరిశ్రమల లైసెన్సులు రద్దయినట్లు తెలుస్తోంది. వీటిలో హరి ఓం ట్రేడర్స్, హేమ స్టీల్స్, సంతోష్ కాంట్రాక్ట్ వర్క్స్, సాయి కృష్ణ కాంట్రాక్ట్ వర్క్స్, పెద్ద మస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఉన్నట్లు సమాచారం. GST స్కాంపై అధికారులు గుట్టుచప్పుడు కాకుండా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ జాబితాలోకి మరికొన్ని సంస్థలు చేరనున్నాయి.


