News October 14, 2025

చిత్తూరు జిల్లాలో TDPని చుట్టుముడుతున్న వివాదాలు

image

చారిత్రాత్మక విజయం అనంతరం జిల్లాలో TDP బలోపేతం అవుతుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంబేడ్కర్ విగ్రహ దహనం, నకిలీ లిక్కర్ స్కామ్, మహిళలపై లైంగిక వేధింపులతోపాటూ వారి వ్యక్తిగత వీడియోలు తీసిపెట్టాలనే ఆరోపణలు జిల్లాలోని కూటమి MLAల మెడకు చుట్టుకుంటున్నాయి. శుభమా అని అన్ని సీట్లు గెలిచిన TDPలో ఏడాదిన్నరలోపే వివాదాలు రేగడం అధిష్ఠానం వైఫల్యమే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News October 14, 2025

KNR: బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం..!

image

KNR(D) కొత్తపల్లి PS పరిధిలో ఘోరం జరిగింది. ఓ బాలికకు ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాని(గ్రానైట్ క్వారీ)కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కాగా, వీరందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం. బాలిక, యువకులు చిన్నపటి నుంచి కలిసి తిరిగేవారు. ఈ క్రమంలోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అక్కడితో ఆగకుండా ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశారు. వీడియో వైరలై బాలిక కుటంబీకుల కంటపడింది.

News October 14, 2025

రేపటి నుంచి నో ఫ్లై జోన్ : కర్నూలు ఎస్పీ

image

రేపటి నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ‘No Fly Zone for Drones’గా ప్రకటించామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రధాని <<18001616>>మోదీ<<>> పర్యటన ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా, 7500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పసుపుల రోడ్డులోని కన్వెకేషన్ హాల్‌లో బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.

News October 14, 2025

BREAKING: లొంగిపోయిన మల్లోజుల

image

మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు 60 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దికాలంగా ఈయన మావోయిస్టుల ప్రస్తుత పంథాకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేస్తుండటం తెలిసిందే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన 30 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నారు. ఈయనపై 100కు పైగా కేసులున్నాయి. రూ.1కోటి రివార్డు ఉంది.