News February 7, 2025

చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి 18వ ర్యాంకు

image

చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పనితీరుకు 18వ ర్యాంకు లభించింది. రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. కాగా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి దక్కని సంగతి తెలిసిందే.

Similar News

News February 7, 2025

బీసీ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు గడువు 12కు పెంపు

image

బీసీ కార్పొరేషన్ దరఖాస్తు గడువును 12కు పెంచినట్లు చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకూ పెంచిందన్నారు.

News February 7, 2025

చిత్తూరు: అంత్యక్రియల్లో అపశ్రుతి

image

అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బాణసంచా పేలి పలువురికి గాయాలైన ఘటన గంగవరం మండలంలో జరిగింది. దండపల్లి గ్రామానికి చెందిన మునివెంకటమ్మ(82) మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బాణసంచా పేల్చే క్రమంలో సంచిలో ఉన్న టపాకాయలకు నిప్పు అంటుకుని బాణసంచా జనంపైకి దూసుకెళ్లింది. దీంతో వెంకటరమణ, కుమార్, చిన్నబ్బ, చిన్నన్న, గురవయ్య, కుమార్ బాబుకి గాయాలు కాగా వారిని పలమనేరు, చిత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.

News February 7, 2025

చిత్తూరు: 66 ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్‌లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.

error: Content is protected !!