News October 26, 2024
చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ గమనిక

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే సంక్షిప్త సమాచారాలు, మెయిల్స్ లలోని లింకులను ఓపెన్ చేయకుండా తిరస్కరించాలని చెప్పారు. మోసపోయాం అని గ్రహించిన తక్షణమే Cyber Helpline 1930 కు గాని సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ http://cybercrime.gov.in/ కు గాని జిల్లా పోలీస్ వాట్సప్ నెంబర్ 9440900005 కు గాని తెలపాలన్నారు.
Similar News
News February 16, 2026
కార్మికులకు పింఛను సౌకర్యం

రోజువారి కూలీలతో జీవనం సాగించే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. వయసును బట్టి నెలకు ప్రీమియం రూ. 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల అనంతరం నెలవారి రూ. 3 వేలు పింఛను వస్తుంది. లబ్ధిదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50% పింఛన్ చెల్లిస్తారు.
News February 16, 2026
కుప్పం: ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా సిలిండర్ కొనాల్సిందే..!

కుప్పం GH లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా ఆసుపత్రి వారు మాత్రం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో కుప్పం GH కు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంటును అందజేశారు. అయితే అప్పటి YCP ప్రభుత్వం సైతం మరో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 2 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో మరమ్మతులు కాగా సుమారు ఏడాదికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.