News June 27, 2024

చిత్తూరు: టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాషాతో సహా 17 మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రొంపిచర్ల నందు గల ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి చేరారు.

Similar News

News January 24, 2025

తిరుమలలో పలు సేవలు రద్దు

image

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.

News January 24, 2025

చిత్తూరు: కొత్త దంపతులకు ఊహించని పెళ్లి కానుక 

image

స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు బహుమతిగా విలువైన వస్తువులు ఇస్తుంటాం. కానీ చిత్తూరులో ఓ జంటకు అందిన బహుమతికి అందరూ ఆశ్చర్యపోయారు. నగరంలో జరిగిన ఓ పెళ్లికి ట్రాఫిక్ CI నిత్యబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన దంపతులకు బైకు హెల్మెట్‌ను బహూకరించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని, అప్పుడే మనతోపాటూ మనల్నే నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటారన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.  

News January 24, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.