News February 8, 2026

చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ లో తప్పిదాల సవరణకు అవకాశం కల్పించారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఆన్ లైన్లో సవరణలు చేసుకునేందుకు హెచ్ఎం లాగిన్‌లో అవకాశం కల్పించారన్నారు. దీన్ని ఆయా హెచ్ఎంలు సద్వినియోగం చేసుకుని, ఈనెల 12వ తేదీ లోపు తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలన్నారు.

Similar News

News February 9, 2026

వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్‌కు వచ్చినా ఫిర్యాదు మళ్లీ రాకుండా బాధితుల పరిధిలోనే పరిష్కరించేలా చూడాలని సూచించారు.

News February 9, 2026

సదుం: ‘నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ఫారం నిర్వాహకులు జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై సూచించారు. ఫారంల వద్దకు దాణా, కోడిగుడ్లు సరఫరా చేసే వాహనాలను, ఇతర వ్యక్తులను రాకుండా చూడాలన్నారు. కోళ్ల ఉత్పత్తులు ఆహారం లో వినియోగించేవారు 100 డిగ్రీలు వేడి చేసి వాటిని తినాలని తెలిపారు.

News February 9, 2026

చిత్తూరు: నేటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగుతాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.