News January 2, 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొత్త అందాలు.!

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అమ్మాయిలు గ్లామర్ ఫీల్డ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు వెండి తెరపై ఇప్పటికే సందడి చేస్తుండగా మరికొందరు చదువుకొంటునే కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. చిత్తూరుకు చెందిన <<18734489>>అర్చన<<>> ‘శంబాల’తో హిట్ కొట్టగా మిస్ ఆంధ్ర పోటీల్లో టీనేజీ విభాగంలో తవణంపల్లె మండలానికి చెందిన సహస్ర సత్తా చాటింది. ఇదే పోటీల్లో వెంకటగిరి యువతి అక్షయ రెడ్డి ఏకంగా టైటిల్ కొల్లగొట్టింది.

Similar News

News January 2, 2026

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సూర్యాపేట ఎస్పీ

image

సైబర్ మోసాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ చేపట్టిన ‘ఫ్రాడ్ కాల్ పుల్ స్టాప్’ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లోన్లు, బహుమతుల కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలపవద్దన్నారు. బాధితులు తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ప్రజల సహకారంతోనే సైబర్ నేరాలను అరికట్టగలమని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 2, 2026

సంక్రాంతికి రైతు భరోసా!

image

TG: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతుభరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’తెలిపింది. SMలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో సర్కార్ ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్లు వెల్లడించింది.

News January 2, 2026

ఈ ఏడాదిలోగా సర్వే పూర్తి: బాపట్ల JC

image

రీసర్వే పూర్తైన భూములకు జనవరి 9 వరకు 11 మండలాల్లోని 29 గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం బాపట్ల JC భావన విశిష్ట తెలిపారు. జిల్లాలో 31,760 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా, తొలిరోజు 3 రెవెన్యూ డివిజన్లలో 4,075 పట్టాలు అందజేశామన్నారు. తొలి 2 విడతల్లో 89 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు. మే నెలలో ప్రారంభమయ్యే 5 విడతతో సహా, 6 విడతల్లో ప్రణాళికాబద్ధంగా రీసర్వే పూర్తి చేస్తామన్నారు.