News January 7, 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాలో 600 ఉద్యోగాలు..!

image

SIPB సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తిరుపతిలో ఎథీరియల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ రూ.578 కోట్లు, నవ ఫుడ్ సెంటర్ రూ.44.42 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ అంప్స్ సంస్థ రూ.159 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

Similar News

News February 18, 2026

నెల్లూరు: ఆ 6 గ్రామాల్లో సోలార్ సిస్టం

image

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద నెల్లూరు జిల్లాలో ఆరు పల్లెలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి విడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లిలో సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఆదాతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు.

News February 18, 2026

కామారెడ్డి: టెన్త్ పాసయ్యారా? మీ కోసమే..!

image

కామారెడ్డిలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీ (శుక్రవారం) జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు టెన్త్ చదివి ఉండాలని, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

News February 18, 2026

నిర్మల్ జిల్లాలో ఎల్లుండి సెలవు

image

ఫిబ్రవరి 20న నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దానికి బదులు మార్చి 14 (రెండో శనివారం)ను పని దినంగా ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.