News February 14, 2025
చిత్తూరు: ‘ధర్నాకు అనుమతులు లేవు’

చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం వైసీసీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథ్ స్పందిస్తూ ధర్నాకు పోలీసులు ఎటువంటి ముందస్తు అనుమతులు ఇవ్వలేదన్నారు. ధర్నాకు హాజరు కావాలని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అనుసరించి ధర్నాకు సహకరించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని గురువారం డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 12, 2025
K.V.N చక్రధరబాబుకు చిత్తూరు జిల్లా బాధ్యతలు

చిత్తూరు జిల్లా ప్రత్యేకాధికారిగా K.V.N చక్రధరబాబు IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.
News March 12, 2025
యువతిపై అత్యాచారం.. నలుగురి అరెస్ట్

కార్వేటినగరం మండలంలో అత్యాచారం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో అమ్మాయిని బలవంతం చేసిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు గోపిశెట్టిపల్లి పెద్దహరిజనవాడకు చెందిన నాగరాజు, దినేశ్, పవన్ కుమార్, జయరాంను నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని ఎస్ఐ తెలిపారు.
News March 12, 2025
ఎంపీ ల్యాడ్స్ పనులు పూర్తి చేయాలి

ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన పనుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 48 పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.