News April 3, 2025
చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది. 1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.
Similar News
News April 4, 2025
అమ్మవారి సేవలో చిత్తూరు SP

నగరి గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లిని గురువారం చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పనికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
News April 4, 2025
ఆలయాల అభివృద్ధికి 15 రోజుల్లో ప్రతిపాదనలు: కలెక్టర్

కుప్పం నియోజకవర్గంలో 11 దేవాలయాల అభివృద్ధికి సంబంధించి 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దేవాలయాల అభివృద్ధికి సంబంధించి ఇది వరకే ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారులు త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు.
News April 3, 2025
చిత్తూరు: తండ్రిని చంపిన కుమారుడు

తండ్రిని కుమారుడే హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. SRపురం మండలం ఆర్ఆర్ పురానికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తల్లిని కొట్టేవాడు. ఇదే విషయమై తండ్రితో కుమారుడు నాగరాజు గొడవ పడ్డాడు. ఈక్రమంలో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.