News February 20, 2025
చిత్తూరు: పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో 30,652 మంది విద్యార్థులు, పదో తరగతిలో 21,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణలో చీటింగ్‌కి పాల్పడితే ఎగ్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 21, 2025
చిత్తూరు: రేపు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు, సభ్యులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News February 21, 2025
22న కుప్పానికి హైపర్ ఆది రాక

ప్రముఖ బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమానికి ఆదితోపాటూ, మరో నటుడు రాంప్రసాద్ సైతం వస్తున్నారు.
News February 20, 2025
చిత్తూరు జిల్లాలో ఇవాల్టి ముఖ్య ఘటనలు

✒ చిత్తూరు జిల్లాలో పబ్లిక్ పరీక్షలపై కలెక్టర్ కీలక ఆదేశాలు
✒ 22న కుప్పానికి హైపర్ ఆది రాక
✒ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం: కుప్పం DSP
✒ కార్వేటినగరంలో ముగ్గురి అరెస్ట్
✒ తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
✒ చిత్తూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
✒ తిరుపతి-పీలేరు హైవేపై రెండు కార్లు ఢీ
✒ జీడీ నెల్లూరు MRO ఆఫీసులో తనిఖీలు