News April 13, 2024
చిత్తూరు: పవన్ కళ్యాణ్ పై మిథున్ రెడ్డి విమర్శలు

భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పిఠాపురంలో పవన్ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అక్కడ వంగాగీత బలమైన నేత అని, ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు తీసుకోని బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో వంగాగీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 6, 2025
స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ హాజరయ్యారు. స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో ఏడు అవార్డులు, జిల్లాస్థాయిలో 55 అవార్డులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 6, 2025
చిత్తూరు విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు

చిత్తూర్ అపోలో యూనివర్సిటీ విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్లో 2022-23 వాలంటీర్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి విద్యార్థి జిష్ణు అందుకున్నాడు. ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జిష్ణు పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, సామాజిక సేవ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు.
News October 6, 2025
రేపు అధికారికంగా వాల్మీకి జయంతి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. రేపు జిల్లా సచివాలయంలోని వివేకానంద భవన్లో ఉ.10.30 గం.లకు మహర్షి వాల్మీకి చిత్రపటానికి అంజలి ఘటించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.