News December 22, 2025

చిత్తూరు పోలీసులకు 50 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 50 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 5, భూతగాదాలపై 18 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ
సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News December 23, 2025

చిత్తూరు: మూడేళ్ల నుంచి 257 మంది మృతి

image

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.

News December 23, 2025

చిత్తూరు జిల్లాలో మందగిస్తున్న ఉపాధి పనులు.!

image

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

News December 23, 2025

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ‘ముస్తాబు’

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. వసతి గృహాలు, ముస్తబు కార్యక్రమ అమలుపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మిడ్ డే మీల్స్‌ను మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆయన సూచించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీవో వెంకట రమణ పాల్గొన్నారు.