News March 11, 2025

చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 అర్జీలు

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 ఫిర్యాదులు అందినట్టు అధికారులు సోమవారం తెలిపారు. రెవెన్యూ 112, పంచాయతీ రాజ్ ఒకటి, పోలీస్ శాఖ 11, పంచాయతీరాజ్‌కు మూడు ఫిర్యాదులు వచ్చినట్టు వారు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

చిత్తూరు DMHO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

News March 10, 2025

చిత్తూరు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 ఫిర్యాదులు

image

చిత్తూరు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 41 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News March 10, 2025

అర్జీలను స్వీకరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్

image

చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీలు సమర్పించి, జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!