News April 16, 2025
చిత్తూరు: ‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధి జర్నలిస్టులే’

ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటి వారు అని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఈ నెల 22న జరగనున్న APWJF 4వ జిల్లా మహాసభలకు ఆహ్వానిస్తూ కలెక్టర్ ఛాంబర్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వాస్తవాలను ప్రచురించడంలో జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి అండగా ఉంటామన్నారు.
Similar News
News April 16, 2025
చిత్తూరు: జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

చిత్తూరులో ఈనెల 19న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను చిత్తూరు ఎంపీ దగ్గుమాళ్ల ప్రసాద్ రావు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్ మంగళవారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయింట్, సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో పీవీకెఎన్ డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటలకు 20 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 15, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కొత్తగా 199 పోస్టులు రానున్నాయి. వీటిలో 117 ఎస్‌జీటీ, 82 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 164 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 82 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 82 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
News April 15, 2025
చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన ఎంపీ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం కలిశారు. పలు అంశాలపై సమీక్షించారు. ప్రజా సంక్షేమం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఎంపీ సూచించారు.