News March 1, 2025

చిత్తూరు: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తెలుగు/హిందీ/సంస్కృతం/ఉర్దూ/తమిళం పరీక్షలకు 14,480 మందికి గాను 13794 మంది విద్యార్థులు హాజరు కాగా, 686 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 2088 మందికి గాను 1885 మంది హాజరు కాగా 203 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు

Similar News

News March 2, 2025

చిత్తూరు జిల్లాలో 96% పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు 96 శాతం పంపిణీ చేశారు. 2,64,899 మంది లబ్ధిదారులకుగాను 2,54,375 మందికి (96.03) పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీడి నెల్లూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. 

News March 2, 2025

2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు: CM

image

చిత్తూరు జిల్లాలో త్వరలోనే 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు CM చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం GDనెల్లూరులో పర్యటించిన ఆయన.. NTR జలాశాయంతోపాటూ ఇక్కడే బాలుర గురుకులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు CM తెలిపారు. వాటితో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 2, 2025

కుప్పం టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎత్తివేత

image

కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ పెట్టిన ఆంక్షలు ఎత్తివేసినట్లు పీఐసీ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బ్యాంకు మేనేజర్ శివకృష్ణ పేర్కొన్నారు. ఇకపై బ్యాంకులో మోర్టగేజ్, గోల్డ్, హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మార్చి తర్వాత షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డిపెండెంట్లు సైతం చెల్లిస్తామని, బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన సుమారు రూ.3 కోట్ల బకాయిలను రికవరీ చేసినట్లు వారు తెలిపారు.

error: Content is protected !!