News December 12, 2024
చిత్తూరు: ప్రాణం తీసిన యువకుడి వేధింపులు

ప్రేమించమని వేధించడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి(M) పాచిగుంటలో జరిగింది. ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు.. కీర్తన(17)కు ఇటీవల వివాహమైంది. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ ప్రేమించాలని వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
Similar News
News February 10, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
News February 10, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం

నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన యానాది గజేంద్ర (31) ప్రమాదవశాత్తు బావిలోకి దిగి మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మున్నెప్ప వ్యవసాయ బావిలోకి మోటర్ మరమ్మతుకై దిగుతుండగా గజేంద్ర కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 10, 2026
ఎల్లుండి నుంచి మొగిలిలో బ్రహ్మోత్సవాలు

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని స్వయంభు మొగిలేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మునిరాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పారు.


