News August 29, 2024
చిత్తూరు: బస్సులో మహిళా దొంగల హల్చల్

నగలు కాజేసిన ఇద్దరు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తిరుపతిలో బెంగుళూరుకు బస్సు ఎక్కిన ఉమాదేవితో బంగారుపాళెం వద్ద బస్సు ఎక్కిన మహిళలు పక్కనే కూర్చుని మాటలు కలిపారు. ఆమె వద్ద ఉన్న నగల సంచి మాట్లాడుతూనే కాజేసి పలమనేరులో దిగిపోయారు. మహిళ పోలీసులను ఆశ్రయించింది. సీఐ నరసింహరాజు బృందం వారిని పట్టుకుని రూ.4.5 లక్షల విలువైన ఆభరణాలు ఉమాదేవికి అప్పగించారు. నిందితులు చిత్తూరు వాసులుగా గుర్తించారు.
Similar News
News October 26, 2025
ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించిన చిత్తూరు SP

జిల్లా AR కార్యాలయంలో పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శనను SP తుషార్ డూడీ ఆదివారం ప్రారంభించారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు స్వయంగా ఆయుధాలు గురించి వివరించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఏటా రెండు రోజులపాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు నిత్యజీవితంలో ఎదుర్కొనే సవాళ్లు, ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు.
News October 26, 2025
చిత్తూరు జిల్లా స్పెషల్ అధికారిగా గిరీష నియామకం

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా పీఎస్ గిరీషను నియమించింది. వర్షాల ప్రభావం తగ్గే వరకు ఆయన విధుల్లో ఉండనున్నారు. జిల్లాకు వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News October 26, 2025
నేడు పని చేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యం కోసం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.


