News April 19, 2024
చిత్తూరు: భర్తను చంపిన భార్య

భార్యే భర్తను చంపిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 9, 2025
చిత్తూరు: రూ. 346 కోట్ల రుణాలు పంపిణీ

స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలతో జిల్లా ప్రగతిపై ఆమె సమీక్షించారు. ‘ఉన్నతి’ ద్వారా రూ.20 కోట్లు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని, ఈ అంశాలను ప్రజల్లో తీసుకెళ్లి వారి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు.
News October 8, 2025
పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
News October 8, 2025
చిత్తూరు: రైతులకు విరివిగా రుణాలు

ప్రభుత్వ ఆదేశాలతో రబీ సీజన్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంకు మేనేజర్ హరీష్ వివిధ బ్యాంకులను ఆదేశించారు. రబీ సీజన్‌లో 3,479 కోట్ల వరకు రైతులకు రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో 3.20 లక్షలు మంది రైతులు రుణాలు పొందవచ్చని సూచించారు. అనుబంధ రంగాలకు అదనంగా మరో రూ.16.3 కోట్లు రుణాలు మంజూరు చేస్తామన్నారు.