News May 27, 2024

చిత్తూరు: మందకొడిగా సర్వీస్ ఓట్ల పోలింగ్

image

చిత్తూరు జిల్లాలో త్రివిధ దళాలకు చెందిన 3380 మంది ఉద్యోగులు సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా పూతలపట్టులో 1075, అత్యల్పంగా నగరిలో 139 ఓట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ETPBS) ద్వారా వీరంతా ఓటు వేసేలా అవకాశం కల్పించారు. ఈక్రమంలో ఇప్పటి వరకు 800 మంది ఓటు వేశారు. కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలలోగా మిగిలిన వాళ్లు ఓటు వేయవచ్చు.

Similar News

News September 29, 2024

తిరుపతి: పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైనట్టు జనసేన నాయకులు తెలిపారు. అక్టోబర్ 2న సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారని చెప్పారు. అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి 9 గంటలకు తిరుమల చేరుకుంటారని చెప్పారు. 3వ తేదీ స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ఆరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభకు హాజరవుతారని చెప్పారు.

News September 29, 2024

చిత్తూరు సబ్ జైల్లో భద్రతపై సమీక్ష

image

చిత్తూరు సబ్ జైలులో భద్రత ఏర్పాట్లపై ఎస్పీ మణికంఠ సమీక్ష నిర్వహించారు. భద్రత, ఖైదీల హక్కులు, జైలు సిబ్బంది పనితీరును ఆయన సమీక్షించారు. ఖైదీలకు సురక్షితమైన, నైతిక పరిరక్షణను కల్పించడంలో జైలు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గార్డులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత శ్రద్ధ చూపాలని తెలిపారు. ఖైదీలలో పరివర్తనకు కృషి చేయాలన్నారు.

News September 28, 2024

మొగిలి ఘాట్ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

image

మొగిలి ఘాట్ నందు ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. మొగిలి ఘాట్ వద్ద చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి ఒక అంబులెన్స్, క్రేన్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.