News April 12, 2025
చిత్తూరు: మచ్చా.. నా రిజల్ట్ చూడు రా..!

చిత్తూరు జిల్లాలో 30,713 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 15,639, సెకండియర్‌లో 15, 074 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘మచ్చా.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.
Similar News
News January 29, 2026
CM కుప్పం పర్యటనలో స్వల్ప మార్పు..!

CM చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 30, 31, ఫిబ్రవరి 1న CM కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 30వ తేదీ మధ్యాహ్నం గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభించనున్నారు. ఒకటో తేదీ సాయంత్రం నియోజకవర్గ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.
News January 29, 2026
చిత్తూరు: మీకు కరెంట్ సమస్యలు ఉన్నాయా..?

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలు నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. వాటిని దశలవారీగా పరిష్కరించనున్నట్లు వివరించారు. గ్రామాలకు అధికారులు వచ్చినప్పుడు ప్రజలు సమస్యలను చెప్పాలని కోరారు.
News January 29, 2026
చిత్తూరులో బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల

చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 మద్యం బార్లను ఏర్పాటు చేయడానికి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రీ-నోటిఫికేషన్ జారీ చేశారు. రెండేళ్ల పాటు లైసెన్సు జారీ చేస్తామని, ఆసక్తి ఉన్న వ్యాపారులు వచ్చేనెల 4 సాయంత్రం 6 గంటల లోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 5న కలెక్టరేట్లో లక్కీడిప్ ద్వారా లైసెన్స్లే ఎంపిక చేస్తామన్నారు.


