News February 9, 2025

చిత్తూరు: మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు

image

చిత్తూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన పది మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. తొలుత దరఖాస్తులకు ఐదో తేదీ వరకే గడువు విధించడంతో 13 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 8వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. దరఖాస్తుదారులకు సోమవారం లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News February 10, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో నేడు గ్రీవెన్స్ డే

image

చిత్తూరు కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

News February 9, 2025

బంగారుపాల్యం: ప్రాణం తీసిన ఈత సరదా

image

ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బంగారుపాల్యం మండలం మొగిలిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న సెల్వరాజ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోయిన చెరువులో దిగడంతో గల్లంతయ్యాడు. రెండు రోజులు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని చెరువు నుంచి ఆదివారం వెలికి తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 9, 2025

చిత్తూరు: రెండు రోజుల క్రితం పెళ్లి.. ఇంతలోనే

image

రెండు రోజుల క్రితం పెళ్లి.. కొత్త దంపతులతో సహా పలువురు వధువు ఇంటికి విందుకు బయలుదేరారు. సరదాగా సాగుతున్న వారి ప్రయాణాన్ని లారీ రూపంలో వచ్చిన ప్రమాదం ఛిద్రం చేసింది. GDనెల్లూరు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. యాదమరి(M) దళితవాడకు చెందిన రామన్‌కు కవితతో శుక్రవారం పెళ్లి జరిగింది. శనివారం వారు ఆటోలో వధువు ఇంటికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. 13 మంది గాయపడగా ఒకరు మృతి చెందారు.

error: Content is protected !!