News March 24, 2025
చిత్తూరు: మహిళా VRO ఆత్మహత్య

చిత్తూరులోని సంజయ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న ముత్తుకూరు VRO తనీషా (31) కుటుంబ కలహాలతో శనివారం విషం ద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గమనించి చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఏడేళ్ల క్రితం రమేశ్‌తో తనీషాకు వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కాగా రమేశ్ ఆర్మీలో పని చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
తిరుపతి SVU పరీక్షలు వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
News April 21, 2025
చిత్తూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,478 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-578 ➤ BC-A:111 ➤ BC-B:139
➤ BC-C:19 ➤ BC-D:102 ➤ BC-E:53
➤ SC- గ్రేడ్1:21 ➤ SC-గ్రేడ్2:94 ➤ SC-గ్రేడ్3:112
➤ ST:95 ➤ EWS:138
➤ PH-విజువల్:1 ➤ PH- హియర్:10
➤ ట్రైబల్ వెల్ఫేర్ :5
News April 21, 2025
మే 6 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న అమ్మవారి జాతర జరగనుంది. 14న ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. పుష్ప-2లోనూ ఈ జాతర ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే