News April 10, 2025

చిత్తూరు: ముగిసిన టెన్త్ వ్యాల్యుయేషన్

image

చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.

Similar News

News April 18, 2025

తిరుమలలో కారు దగ్ధం.. భక్తులు సురక్షితం

image

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు రావడంతో వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News April 18, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక 

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌లకు హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. సంబంధిత మెరిట్ సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు  డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే 20వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు తన కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. సెలవు దినాల్లోనూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.  

News April 17, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్ 

image

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.

error: Content is protected !!