News March 24, 2024
చిత్తూరు: ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

చిత్తూరు జిల్లా సదుం మండలం ఊటుపల్లె సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. B.గురుమూర్తి, ఎం.ఈశ్వ రయ్య, కె.బాలాజీ ఈనెల 19న వైసీపీ నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీసీవై పార్టీ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో వివరించారు.
Similar News
News December 31, 2025
చిత్తూరు: పెన్షనర్లకు గమనిక

చిత్తూరు జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ DD రామచంద్ర సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని.. గడువులోపు సమర్పించకపోతే మార్చి నెల పింఛన్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
News December 31, 2025
చిత్తూరు ఎంపీ పనితీరు ఇలా..!

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు పార్లమెంట్ సమావేశాల్లో 94శాతం అటెండెన్స్ నమోదు చేశారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశంలో ఏ రోజూ ఆయన పార్లమెంట్‌కు గైర్హాజరు కాలేదు. హెల్త్ సెక్యూరిటీ సెస్ బిల్లు, బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడారు. 7 చర్చల్లో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు 122 ప్రశ్నలను పార్లమెంట్‌లో సంధించారు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టలేదు.
News December 31, 2025
చిత్తూరు: CC కెమెరాలతో 152 కేసుల పరిష్కారం

చిత్తూరు జిల్లా పోలీసులు 2025లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 152 కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 755 లొకేషన్లలో 2406 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు సంబంధించి CC కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం CC కెమెరాల ఏర్పాటుపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


