News August 22, 2025
చిత్తూరు: మెగా DSC ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సిద్ధం

మెగా DSC పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు చిత్తూరు జిల్లా అధికారులు పకడ్బందింగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ, ఎస్‌వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలను సర్టిఫికెట్ పరిశీలనా కేంద్రాలుగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో 1,473 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో 30 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
Similar News
News August 22, 2025
HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.
News August 22, 2025
త్వరలోనే ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి: మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థల ఎన్నికలు అతి కొద్ది రోజుల్లోనే రావచ్చని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే సర్దుకుపోవాలన్నారు. త్వరలో పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
News August 22, 2025
VKB: భద్రత, బందోబస్తు కోసమే ఆన్లైన్: ఎస్పీ

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఆన్లైన్ నమోదు భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం మాత్రమేనని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ మండపం సమాచారం అందుబాటులో ఉంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు అవకాశం ఉంటుందన్నారు.