News March 6, 2025

చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ 

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌‌ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం SI రాజ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సుమారు 31 కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. నిందితుడిని ఇవాళ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ఊతుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన సిబ్బందిని SP అభినందించారు.

Similar News

News July 6, 2025

తవణంపల్లిలో రోడ్డు ప్రమాదం

image

తవణంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మాధవరం వెళుతున్న ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో అరగొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌‌తో డ్రైవర్ పరారయ్యాడు. మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

News July 6, 2025

చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

image

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.