News December 19, 2025
చిత్తూరు: రూ.3.73 కోట్ల పన్ను వసూళ్లు

చిత్తూరు జిల్లా గ్రామాల్లో పన్ను వసూళ్లలో మెరుగైన స్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17.60 కోట్ల మేర డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.3.70 కోట్లు వసూలైంది. రూ.3.26 కోట్ల బకాయిలకు రూ.53 లక్షలు వసూలైంది. మొత్తంగా రూ.4.23కోట్లు వచ్చాయి. 20 శాతం వసూళ్లతో జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది.
Similar News
News December 28, 2025
చిత్తూరు: DCCB ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఈనెల 27తో ముగియగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2026 జూన్ 26వ తేదీ వరకు రాజశేఖర్ రెడ్డి DCCB నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు.
News December 28, 2025
నేడు పనిచేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. వీరితో పాటు హెచ్ఎ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని ఆయన కోరారు.
News December 28, 2025
చిత్తూరు: మీ ఊర్లో కరెంట్ సమస్యలు ఉన్నాయా.?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో మొదటిసారి కార్యక్రమాన్ని సీఎండీ ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు తమ సమస్యలపై ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.


