News May 25, 2024

చిత్తూరు: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్ వద్ద సింగన్నగారిపల్లె యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కదిరి రైల్వేహెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా తెలిపారు. కురబలకోట మండలం, సింగన్నగారిపల్లెకు చెందిన కన్నెమడుగు గిరిబాబు(37), 5ఏళ్లుగా టీబీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన గిరిబాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 16, 2025

చిత్తూరు: 19న మెగా జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, పీజీ, డీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 15, 2025

రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్‌పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్‌పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 15, 2025

కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.