News April 20, 2025

చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 10, 2025

చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

News November 9, 2025

త్వరలోనే ఏనుగుల సమస్యలకు పరిష్కారం: పవన్

image

ఏనుగుల గుంపుతో కన్నా ఒంటరి ఏనుగుతోనే ఎక్కువ ప్రమాదమని MLA అమర్‌నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన Dy.CM పవన్‌తో కలిసి పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు ‘ఏనుగులతో సమస్యలు వాటి పరిష్కార మార్గాలను’ వివరించారు. కుంకీ ఏనుగులతో ఒంటరి ఏనుగులకు చెక్ పెట్టవచ్చని, దీనికి సాంకేతిక తోడైతే మరింత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, DFO పాల్గొన్నారు.

News November 8, 2025

వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం: బాబు

image

1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందించామన్నారు. P4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశామని చెప్పారు. 7,489 SC, ST కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని ఇది 10 లక్షలకు చేరాలని కోరారు.