News August 8, 2024
చిత్తూరు: లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గృహ నిర్మాణాలపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 22,125 గృహాల నిర్మాణాల పూర్తికి లబ్ధిదారులతో చర్చించి.. నిర్మాణాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను ప్రతి లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. డీఆర్‌డీఎ ద్వారా మహిళా సంఘ సభ్యులకు రుణాలు అందించేలా చూడాలన్నారు.
Similar News
News March 2, 2026
చిత్తూరు: పన్ను వసూళ్లకు 15 వరకు గడువు

చిత్తూరు జిల్లాలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు ఇచ్చినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలో 75 శాతం వసూళ్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం లక్ష్యం రూ.27.41 కోట్లు కాగా అందులో 75 శాతం అంటే రూ.20.55 కోట్లు రాబట్టామన్నారు. 15వ తేదీలోపు మిగిలిన 25 శాతం పన్నులను వసూలు చేయడానికి కృషి చేస్తామని వివరించారు.
News March 2, 2026
చిత్తూరు: టీచర్లకు గమనిక

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.
News March 2, 2026
చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.


