News January 5, 2026

చిత్తూరు: లింగం మార్చి.. అమ్మాయి పక్క సీట్ బుక్ చేసి.!

image

ఇటీవల ఓ అమ్మాయి చిత్తూరు నుంచి బెంగళూరుకు RTC బస్సులో సీట్ బుక్ చేసుకుంది. ఆమె పక్క సీటులో అబ్బాయి ప్రత్యక్షం అయ్యాడు. ఆరా తీయగా మహిళ పేరుతో సీటు బుక్ చేసుకున్నట్లు తేలింది. సదరు అమ్మాయి తండ్రి కండక్టర్‌ను ప్రశ్నించగా నేనేమీ చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీనిపై RTC అధికారులు విచారించారు. లింగ వివరాలు తప్పుగా ఉన్న టిక్కెట్లు చెల్లవని DPTO రాము స్పష్టం చేశారు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా.?

Similar News

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: ప్రశ్నాపత్రాల తరలింపు

image

జనగామ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్‌లకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశ్నాపత్రాలను అందజేశారు. పోలీసు బందోబస్తు నడుమ వీటిని నిర్దేశించిన కేంద్రాలకు తరలించారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

News February 21, 2026

MHBD: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు అనుష్క

image

జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అనుష్క ప్రతిభ చాటింది. 6వ తరగతి చదువుతున్న అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు HM ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ఘనంగా అభినందించారు.

News February 21, 2026

అథ్లెటిక్స్‌లో సిద్దిపేట జిల్లాకు రెండు పతకాలు

image

హనుమకొండలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు సత్తా చాటారు. రెండో రోజు జిల్లాకు చెందిన ఇద్దరు పతకాలు సాధించినట్లు కోచ్ వెంకటస్వామి తెలిపారు. అండర్-16 బాలుర షాట్‌పుట్ విభాగంలో చేర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రణయ్ కుమార్ వెండి పతకం సాధించగా, బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో చింతమడక కేవీఆర్‌ఎస్ జెడ్‌పీహెచ్ఎస్ విద్యార్థిని చక్రిక కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.