News April 21, 2024
చిత్తూరు: వడదెబ్బ తగిలి ఏఎస్ఐకి తీవ్ర గాయాలు
తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళ్తున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్ద వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేశ్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News December 22, 2024
చిత్తూరు: తండ్రే హత్య చేయించాడు.?
పుంగనూరు(M) లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె(M) గుంపులపల్లె సోమశేఖర్‌రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటుుబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
News December 22, 2024
చిత్తూరు: నేటి నుంచి టీచర్లకు కౌన్సెలింగ్
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.
News December 21, 2024
బైరెడ్డిపల్లి: డెంగ్యూతో విద్యార్థిని మృతి
బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.