News January 24, 2026
చిత్తూరు: వేతనం చెల్లించకపోతే కాల్ చేయండి

ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతం వీబీజీ- రామ్ జీగా మార్చిన సంగతి తెలిసిందే. కూలీలకు వేతనం చెల్లించకపోయినా, పని ప్రదేశంలో వసతులు లేక పోయినా, జాబ్ కార్డుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 1800 2001 001 టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సమస్యలపై ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Similar News
News February 9, 2026
వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్‌కు వచ్చినా ఫిర్యాదు మళ్లీ రాకుండా బాధితుల పరిధిలోనే పరిష్కరించేలా చూడాలని సూచించారు.
News February 9, 2026
సదుం: ‘నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి’

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ఫారం నిర్వాహకులు జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై సూచించారు. ఫారంల వద్దకు దాణా, కోడిగుడ్లు సరఫరా చేసే వాహనాలను, ఇతర వ్యక్తులను రాకుండా చూడాలన్నారు. కోళ్ల ఉత్పత్తులు ఆహారం లో వినియోగించేవారు 100 డిగ్రీలు వేడి చేసి వాటిని తినాలని తెలిపారు.
News February 9, 2026
చిత్తూరు: నేటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్

చిత్తూరు జిల్లాలో సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగుతాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.


