News August 15, 2025
చిత్తూరు: వైసీపీ నాయకుల పాదయాత్ర

మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆరోపించారు. ఆయన అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. దొడ్డిపల్లి సప్త కన్యకమ్మల ఆలయం నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మారిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
చిత్తూరు: విద్యాశాఖ శకటానికి రెండో బహుమతి

చిత్తూరు పోలీసు గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. వివిధ శాఖల తరఫున 6 శకటాలను ప్రదర్శించారు. జిల్లా విద్యా శాఖ శకటానికి 2వ బహుమతి లభించింది. మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా డీఈవో వరలక్ష్మి, సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణ అందుకున్నారు. ఈ శకటంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, మెగా పీటీఎం 2.0, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ నమూనాలను ప్రదర్శించారు.
News August 15, 2025
చిత్తూరు: జాతీయ పతాకం ఆవిష్కరించిన మంత్రి

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా వందనం స్వీకరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పేరెడ్‌ను తిలకించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
News August 15, 2025
చిత్తూరు: కలెక్టర్ బంగ్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. సిబ్బంది ఆయనకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బంగ్లా సిబ్బంది పాల్గొన్నారు.