News September 29, 2024
చిత్తూరు సబ్ జైల్లో భద్రతపై సమీక్ష
చిత్తూరు సబ్ జైలులో భద్రత ఏర్పాట్లపై ఎస్పీ మణికంఠ సమీక్ష నిర్వహించారు. భద్రత, ఖైదీల హక్కులు, జైలు సిబ్బంది పనితీరును ఆయన సమీక్షించారు. ఖైదీలకు సురక్షితమైన, నైతిక పరిరక్షణను కల్పించడంలో జైలు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గార్డులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత శ్రద్ధ చూపాలని తెలిపారు. ఖైదీలలో పరివర్తనకు కృషి చేయాలన్నారు.
Similar News
News January 6, 2025
తిరుపతి: సంక్రాంతి ట్రైన్లు.. 8గంటలకు బుకింగ్
➥ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➥ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➥చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➥ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➥ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.
News January 6, 2025
తిరుపతి: అంబులెన్స్ ఢీకొని ఇద్దరు భక్తులు మృతి
కాలినడకన వస్తున్న భక్తులను 108 అంబులెన్స్ ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని నారాయణ కళాశాల వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు నుంచి నడుచుకొస్తున్న భక్తులు తిరుపతి వైపుగా వెళుతుండగా వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
News January 6, 2025
SVU: ఫలితాలు విడుదల
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్‌లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.