News August 29, 2025
చిత్తూరు: సీఎం చంద్రబాబు కరుణిస్తారా..?

హంద్రీ నీవా ద్వారా కృష్ణమ్మ వందల కిలో మీటర్లు ప్రయాణించి కుప్పం ఏరియాకు చేరింది. ఈక్రమంలో మదనపల్లె తూర్పు మండలాలల్లో నీటి సమస్య తీర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మదనపల్లె నుంచి సీటీఎం చెరువుకు హంద్రీనీవా కనెక్టివిటీ కాలువ నిర్మించి నీటిని తరలించాలని కోరుతున్నారు. సీఎం చంద్రబాబు ఆ దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. సీఎం కరుణిస్తారా? లేదా? చూడాలి మరి.
Similar News
News August 29, 2025
నాగర్‌కర్నూల్: హోంగార్డ్ కుటుంబానికి చేయూత

అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ చనిపోయిన అమ్రాబాద్ మండలం బి.కె.లక్ష్మాపూర్ తండాకి చెందిన హోంగార్డు జి.దశరథం భార్య సుజాతకు రూ.30,500ను అందజేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నగదును అందించారు. దశరథం చేసిన సేవలు పోలీసు శాఖ ఎప్పటికీ మరువలేనిదన్నారు. బాధిత కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News August 29, 2025
పవన్ వైసీపీ టార్గెట్ వెనుక సుగాలి ప్రీతి వ్యవహారం?

జనసేన పార్టీ సమావేశాలతో విశాఖలో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హఠాత్తుగా <<17553693>>రుషికొండ భవనాలను<<>> సందర్శించి వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అయితే <<17548354>>సుగాలి ప్రీతి<<>> వ్యవహారాన్ని వైసీపీ ఎత్తుకోవడంతోనే పవన్ ఈ రుషికొండ వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానిలో భాగంగానే పవన్ కౌంటర్ స్ట్రాటజీ మొదలుపెట్టారని సమాచారం.
News August 29, 2025
వేములవాడ: ‘రైతులకు రూ 50 వేలు అందిస్తున్నాం’

కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో “పాడి రైతులకు భరోసా” పథకాన్ని పాడి రైతులకు అందిస్తున్నామని కరీంనగర్ పాల డైరీ చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు వెములవాడ మండలం అగ్రహారంలో 17 మంది పాడి రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలను శుక్రవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ డైరీ రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. డైరెక్టర్లు ప్రభాకర్ రావు, సూర్యారావు, మేనేజర్ రవీందర్, రైతులు ఉన్నారు.