News October 25, 2025
చిత్తూరు: సోలార్ ప్లాంట్ల టెండర్లకు ఆమోదం..!

జిల్లాలో <<18100873>>సోలార్ ప్లాంట్ల<<>> టెండర్లు ఖరారయ్యాయి. SPDCL SE ఇస్మాయిల్ అహ్మద్ పర్యవేక్షణలో కుప్పం, చిత్తూరు డివిజన్‌లో ప్లాంట్ పనులు 2026 MAR. ఆఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు పగలే నిరంతరాయంగా 9 గం. విద్యుత్ సరఫరా అందనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.6.50 ఖర్చు కానుండగా సోలార్ విద్యుత్‌తో ఆ ధర రూ.3.20కు దిగి రానుంది.
Similar News
News October 26, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ భేటీ
☛ నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభు’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజయ్యే అవకాశం: సినీ వర్గాలు
☛ సుందర్.సి దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా సినిమా? ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్
☛ ‘కుమారి 21F’ మూవీకి సీక్వెల్‌గా త్వరలో తెరపైకి ‘కుమారి 22F’.. నిర్మాతలుగా సుకుమార్, ఆయన సతీమణి తబిత వ్యవహరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.
News October 26, 2025
సిరిసిల్ల: నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీ యువతి యువకుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, బౌద్ధ, పార్శి, సిక్కు, జైనుల యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


