News February 5, 2026
చిత్తూరు: స్టాక్ మార్కెట్‌లో భారీగా లాస్.. చీఫ్ ఇంజినీర్ సూసైడ్

స్టాక్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో చీఫ్ ఇంజినీర్ హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐరాల(M) బొమ్మసముద్రం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తూ గాజువాకలో ఉంటున్నాడు. ఆయన స్టాక్ మార్కెట్‌లో దాదాపు రూ.36 లక్షలు వరకు కోల్పోయారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య, పాప ఉన్నారు.
Similar News
News February 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 18, 2026
ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
News February 18, 2026
గన్నవరం ఎయిర్‌పోర్ట్.. ఒకే రోజు 3,883 మంది ప్రయాణం!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మంగళవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 2,062 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,821 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.


