News December 18, 2024
చిత్తూరు: ABCD అవార్డు సాధించిన పోలీసులు

చిత్తూరు జిల్లా పోలీసులు ఏబిసిడి (అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్) సాధించినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. గుడిపాలలో జూలై 7న జరిగిన ఏటీఎం దొంగతనం కేసు చేదించి కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ముద్దాయిని అరెస్టు చేసినందుకు ఏబిసిడిలో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. విజయవాడలోడీజీపీ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఎస్పీ అవార్డు అందుకున్నారు.
Similar News
News February 27, 2026
74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
News February 27, 2026
CTR: వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్

చిత్తూరు జిల్లాలో 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు అనారోగ్యంతో బాధపడే కార్డుదారులు 46,919 మంది ఉన్నారు. వీరందరికీ గురువారం నుంచే చౌక దుకాణాల డీలర్లు వారి ఇళ్ల వద్దే రేషన్ సరకులు పంపిణీ ప్రారంభించినట్లు డీఎస్వో శంకరన్ తెలి పారు. మార్చి ఒకటి నుంచి సాధారణ కార్డుదారులకు చౌకదుకాణాల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సరకుల పంపిణీ ఉంటుందన్నారు.
News February 27, 2026
చిత్తూరు: రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్..!

ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పణకు మిగిలిందిక 2 రోజులే. ఈనెల 28 చివరి రోజు కావడంతో ఆన్లైన్ విధానంలో జీవన్ ప్రమాణ్ యాప్‌లో లైవ్ సర్టిఫికెట్ నమోదు చేయవచ్చు. చిత్తూరు జిల్లాలో పెన్షన్‌దారులు 12,500 ఉండగా గురువారం వరకు 11780 మంది లైవ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు. మరో 720 మంది సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంది.


