News June 15, 2024
చిత్తూరు:18న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

ఈ నెల 18న చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్‌లోని నూతన సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లాకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 24, 2026
చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.