News March 15, 2025

చిత్రాడలోని జనసేన సభపై మీ కామెంట్

image

పిఠాపురంలోని చిత్రాడలో ‘జనసేన జయకేతం’సభ విజయవంతంగా ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్‌తో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే తన ప్రసంగంలో స్థానిక అంశాలపై పెద్దగా ఫోకస్ చేయలేదని లోకల్ ప్రజలు అంటున్నారు. హిందీ మన భాష, వైసీపీపై విమర్శలు, నిలిచాం.. టీడీపీని నిలబెట్టాం అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పవన్ చిత్రాడ సభపై మీరెలా ఫీలయ్యారు. కామెంట్ చేయండి..

Similar News

News July 4, 2025

ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.

News July 4, 2025

త్యాగమూర్తి అడుగు జాడల్లో నడవాలి: ASP

image

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుడు అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో అందరూ నడవాలని అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి కోరారు. అల్లూరి చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ముందుకు వెళ్తామని అన్నారు. దేశ స్వతంత్ర్య వికాసానికి పోరాడుతూ.. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురునిలిచిన దేశ భక్తుడు అల్లూరి అని కొనియాడారు.

News July 4, 2025

అమలాపురం: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి ఎస్పీ కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు ఎస్పీ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.