News December 29, 2025

చినవెంకన్న సన్నిధిలో ముక్కోటికి ముస్తాబు.. MLA, కలెక్టర్ పరిశీలన

image

చినవెంకన్న క్షేత్రంలో మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను MLA మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిషోర్‌తో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, మంచినీరు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని MLA పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

అతిపెద్ద జిల్లాగా అవతరించనున్న ‘తూ.గో.’

image

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం కేంద్రంగానే సాగనున్నాయి. ఈ విలీనంతో తూ.గో. జిల్లా విస్తీర్ణం పెరిగి భారీ జిల్లాగా అవతరించనుంది. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో విలీన ప్రక్రియపై చర్చించనున్నారు.

News December 31, 2025

తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్‌లోనే 100 కోట్లు హాంఫట్!

image

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

News December 31, 2025

న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

image

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.