News October 19, 2025

చిన్నకోడూరు: కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి: హరీశ్ రావు

image

సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం చిన్నకోడూరు మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస పత్తి, మొక్కజొన్న రైతుల కష్టాలపై లేదన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కొనుగోళ్లు ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నష్టపరుస్తుందని విమర్శించారు.

Similar News

News October 20, 2025

తప్పిన పెను ప్రమాదం

image

బండి ఆత్మకూరు- పార్నపల్లె గ్రామాల మధ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రమణ రావు కారులో వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News October 20, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ట్విస్ట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇపుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో ఎత్తుగడ వేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత చేత నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకవేళ సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణు గులాబీ పార్టీ నుంచి బరిలో ఉంటాడు.

News October 20, 2025

సంగారెడ్డి: దీపావళి.. 101కు కాల్ చేయండి: కలెక్టర్

image

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవిస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి లేదా 101 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆమె కోరారు.