News March 24, 2025
చిన్నగంజాంలో బాపట్ల జేసీ పర్యటన

చిన్నగంజాం మండలంలోని పెదగంజాం గ్రామ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం హెలికాప్టర్ దిగడానికి నిర్మించనున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ సోమవారం సందర్శించారు. పర్చూరు MLA ఏలూరి సాంబశివరావు, పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.
Similar News
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయిన నాలుగు రోజుల తర్వాత తిరిగి అదే మొత్తాన్ని మరోసారి జమ చేశారు. ఈ విషయం గమనించిన గృహనిర్మాణ శాఖ అధికారులు డబుల్ బిల్లులు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బును రికవరీ చేసి, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని స్థానిక ఏఈ, ఎంపీడీవోలను ఆదేశించారు.
News September 18, 2025
ADB: చుక్క నీటి కోసమే చుట్టూ పోరాటం!

ధనరాశులు ఎంతైనా పోగుచేయగలం కానీ, జలరాశులను సృష్టించలేం. నీటిని వృథా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడానికి ఉమ్మడి ADBలో ఏర్పడిన ఘటనలే నిదర్శనం. 5నదులు, 14 వాగులు, 3500+ చిన్న నీటి వనరులున్న జిల్లాలో వానాకాలంలో తాగునీటి కష్టాలు చూస్తున్నాం. పట్టణాల్లో చెరువులు, వాగులను ఆక్రమించడంతో వానలకు వరదలు రాగా.. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించుకునే పరిస్థితి.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.